News March 27, 2024

ఇల్లంతకుంటలో గుండెపోటుతో విద్యార్థి మృతి !

image

సిరిసిల్ల: గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగింది. గ్రామానికి చెందిన ఎల్లంకి సాయితేజ(14) 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె వ్యాధితో సాయి బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

Similar News

News April 20, 2025

కరీంనగర్: రేపు ప్రజావాణి రద్దు

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులంతా ఆ సదస్సులకు హాజరు కావలసిన ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 20, 2025

కరీంనగర్: పేర్లు నమోదు చేసుకోవాలి: డిప్యూటీ కమిషనర్

image

KNR జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు శ్రమ్ పోర్టల్‌లో తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకట రమణ సూచించారు. భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు సహా అన్ని వర్గాల కార్మికులకు సామాజిక భద్రత అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News April 20, 2025

కరీంనగర్: టెట్ అభ్యర్థుల కోసం ఉచిత విన్నర్స్ ఆన్‌లైన్ యాప్ ఆవిష్కరణ

image

కరీంనగర్‌లో డా. ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో టెట్ అభ్యర్థుల కోసం ఉచితంగా విన్నర్స్ ఆన్‌లైన్ యాప్ విడుదల చేశారు. రాష్ట్రస్థాయిలో పేరు గాంచిన ఫ్యాకల్టీ లెక్చర్లు అందించనున్న ఈ యాప్ ద్వారా రూ.80 లక్షల విలువైన క్లాసులు అభ్యర్థులకు ఫ్రీగా లభించనున్నాయి. ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకొని ఆప్‌ను వీక్షించవచ్చు. ఎన్నికల్లో ఓడినా, నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రసన్న హరికృష్ణ స్పష్టం చేశారు.

error: Content is protected !!