News April 3, 2025
ఇల్లందకుంట: యువ కౌలు రైతు ఆత్మహత్య

వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక యువ కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడులో జరిగింది. స్థానికుల వివరాలు.. వంగ మధు(28) గ్రామంలో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను వేయగా.. రూ.2లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో మనస్తాపంతో ఆదివారం పురుగుమందు తాగి, వరంగల్ MGMలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
Similar News
News April 4, 2025
కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసిన మంత్రి పొన్నం బృందం

కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, BC ఎమ్మెల్యేలలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుల గణన చేసి అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్రం బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని గురువారం వీరేంద్ర కుమార్‌ను మంత్రి కోరారు.
News April 3, 2025
SC, ST అట్రాసిటీ కేసులు 30లోగా పరిష్కరించాలి: బక్కి వెంకటయ్య

వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న SC, STఅట్రాసిటీ కేసులను ఈనెల 30లోగా పరిష్కరించాలని రాష్ట్ర SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
News April 3, 2025
ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి: వెంకటయ్య

ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి సాధించిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ R&B గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై అశ్రద్ధవహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు ఉంటాయన్నారు.