News December 23, 2025
ఇల్లందకుంట రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామాచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కార్యదర్శి సుధాకర్, ఆలయ ఛైర్మన్ రామారావు కోరారు.
Similar News
News December 23, 2025
జనవరి నుంచి రేషన్ డిపోలో గోధుమపిండి: విశాఖ జేసీ

విశాఖలో అన్ని రేషన్ డిపోలలో జనవరి నెల నుంచి గోధుమపిండి పంపిణీ చేయనున్నట్లు జేసీ మయూర్ అశోక్ మంగళవారం తెలిపారు. బియ్యం, పంచదార, రాగులతో పాటు గోధుమపిండి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేజీ గోధుమపిండి రూ.20కి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News December 23, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదాలు తగ్గాయి: ఎస్పీ

శాంతి, భద్రతలను నెలకొల్పడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తూ, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నదని ఎస్పీ పారితోజ్ పంకజ్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో, సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలని నివారణ వంటి విశృత కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 4.2 శాతం తగ్గాయని తెలిపారు.
News December 23, 2025
విద్యుత్ ఛార్జీలు తగ్గించండి… ఇరిగేషన్ శాఖ లేఖ

TG: ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరఫరా అయ్యే విద్యుత్‌పై అదనపు ఛార్జీలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. నెలకు KVAకు ₹300 చొప్పున వసూలు చేయడాన్ని ఆపాలంది. యూనిట్ విద్యుత్‌కు వసూలు చేస్తున్న ₹6.30 సుంకాన్నీ తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్లకు సరఫరా అవుతున్న విద్యుత్ లోడ్ 2819.80 MWగా ఉంది. 2026లో ఇది 7348 MWకు చేరుతుందని అంచనా.


