News April 1, 2025

ఇల్లందకుంట రామాలయం బ్రహ్మోత్సవాలు, జాతర వివరాలు

image

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతాయని ఈవో సుధాకర్ తెలిపారు. ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న పట్టాభిషేకం,12న సూర్య రథోత్సవం( బండ్లు తిరుగుట)13, 14న చంద్ర రథోత్సవం(పెద్దరథం),15న శ్రీ పుష్పయాగం, 16న ఏకాంత సేవలు స్వామివారికి జరుపుతామన్నారు. భక్తులకు వైద్య, విద్యుత్, నీటి ఏర్పాట్లు చేశారు.

Similar News

News January 10, 2026

చలికాలంలో పంటపై పురుగుల ఉద్ధృతికి కారణం ఏమిటి?

image

చలికాలంలో వాతావరణం పొడిగా ఉండటం వల్ల పురుగులు గుడ్లను త్వరగా పొదుగుతాయి. దీంతో అవి ఒకేసారి పంటపై దాడి చేస్తాయి. ఈ సమయంలో గట్లమీద గడ్డి ఎండిపోతుంది. దీంతో ఆహారం కోసం పక్కనే పొలాల్లో పచ్చగా కనిపించే పంటలపై పురుగులు గుంపులుగా దాడి చేసి నాశనం చేస్తాయి. ప్రస్తుతం చాలా పంటలు పూత దశలో ఉంటాయి. వాటి పువ్వుల్లో మకరందం పురుగులకు ఇష్టం. దీంతో అవి ఆకులకంటే పువ్వులనే ఎక్కువగా టార్గెట్ చేసి నష్టపరుస్తాయి.

News January 10, 2026

ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్

image

జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు బాక్సర్లు నిఖత్ జరీన్(51 కేజీలు), హుసాముద్దీన్(60 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీస్‌లో నిఖత్ 4-1 తేడాతో కుసుమ్ బఘేల్‌ను చిత్తు చేశారు. ఫైనల్లో ఆమె 2023 వరల్డ్ ఛాంపియన్ నీతూ గంగ్వాస్‌ను ఎదుర్కోనున్నారు. రామన్‌పై హుసాముద్దీన్ 4-1 తేడాతో గెలిచి ఫైనల్ బౌట్‌కు సిద్ధమయ్యారు. ఇక యంగ్ బాక్సర్ జాదుమణి సింగ్ సీనియర్ బాక్సర్‌ అమిత్ పంఘాల్‌కు షాకిచ్చి ఫైనల్ చేరారు.

News January 10, 2026

చలికాలంలో పురుగుల ఉద్ధృతి తగ్గించడానికి సూచనలు

image

చలికాలంలో పంటలో పురుగుల ఉద్ధృతిని తగ్గించడానికి ఎకరా పొలానికి 25 నీలిరంగు, 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. దీంతో పురుగులు ఆ అట్టలకు అతుక్కొని చనిపోతాయి. పొలంపై కలుపును తొలగించాలి. తోట చుట్టూ 3-4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటలను వేయాలి. ఇవి బయట నుంచి వచ్చే పురుగుల నుంచి పంటను కాపాడతాయి. పంట పూతను కాపాడటానికి పూలపై వేపనూనే స్ప్రే చేయాలి. ఇవి చేదుగా ఉండటం వల్ల పురుగులు పువ్వుల జోలికి రావు.