News November 4, 2025

ఇల్లందుకు బొగ్గుగడ్డగా పేరేలావచ్చిందంటే!

image

1870లో ఇల్లందులో బొగ్గు నిల్వలు బయటపడ్డాయి. అప్పటి నుంచి స్థానికులు ఇల్లందును ‘బొగ్గుగడ్డ’గా పిలుస్తుంటారు. భద్రాద్రి రామయ్య భక్తుడి కారణంగా నల్ల బంగారం వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఎడ్లబండిపై రాములోరి గుడికి వెళ్తూ రాత్రి సమయంలో సింగరేణి, పూసనపల్లి సమీపంలో వంట కోసం అక్కడ నల్లటి రాళ్లను పొయ్యిగా అమర్చారు. రాళ్లు నిప్పు కణికలుగా మారడం, ఎంతకీ ఆరకపోవడంతో దక్కన్ కంపెనీ నిల్వలను గుర్తించింది.

Similar News

News November 4, 2025

ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో ఆహారపదార్థాలను పెట్టడానికి ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ కంటైనర్లపై ప్లాస్టిక్ కంటైనర్ల food-grade/ BPA-free అని ఉంటేనే వాడాలి. వాటిలో వేడి పదార్థాలు వేయకూడదు. పగుళ్లు, గీతలున్న ప్లాస్టిక్ వస్తువులు వాడకపోవడమే మంచిది. PETE రకం ప్లాస్టిక్ డబ్బాలను ఒకట్రెండు సార్లు మాత్రమే వాడాలని చెబుతున్నారు.

News November 4, 2025

చిత్తూరు: ఆలస్యంగా వస్తున్న టీచర్లు..!

image

చిత్తూరు జిల్లాలో సుమారు 100 మంది ప్రభుత్వ టీచర్లు స్కూళ్లకు ఆలస్యంగా వస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని DEO వరలక్ష్మి చెప్పారు. ఆలస్యానికి గల కారణాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం చేయకూడదని స్పష్టం చేశారు.

News November 4, 2025

వరంగల్: 123 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

image

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 123 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 74, సెంట్రల్ జోన్ పరిధిలో 23, వెస్ట్ జోన్ పరిధిలో 18 ఈస్ట్ జోన్ పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి