News August 11, 2024
ఇల్లెందు: టీవీ చూడొద్దన్నందుకు.. పురుగు మందు తాగాడు

తండ్రి టీవీ చూడొద్దన్నందుకు మనస్తాపంతో ఓ బాలుడు పురుగు మందు తాగిన ఘటన ఇల్లెందు మండలంలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అమర్సింగ్ తండాకు చెందిన గుగులోత్ సాయికుమార్(15 ) ఈనెల 7న ఇంట్లో అర్ధరాత్రి టీవీ చూస్తుండగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Similar News
News September 14, 2025
ఖమ్మం జిల్లాలో దడ పుట్టిస్తోన్న డెంగీ..!

ఖమ్మం జిల్లాలో కొద్దిరోజులుగా డెంగీ దడ పుట్టిస్తోంది. రోజురోజుకూ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని వివిధ మండలాల్లో ఇప్పటి వరకు 171 కేసులు నమోదయ్యాయి. 111డెంగీ ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సమావేశాల్లో ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహకులు దండుకుంటున్నారు.
News September 14, 2025
ఖమ్మంలో లోక్ అదాలత్.. 597 కేసులు పరిష్కారం

ఖమ్మం జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ప్రారంభించారు. లోక్ అదాలత్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఆయన చెప్పారు. ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 4,746 కేసులను గుర్తించగా, వాటిలో 597 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. భార్యాభర్తల గొడవలు, ఆస్తి వివాదాలు, బ్యాంక్ రికవరీ, రోడ్డు ప్రమాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు
News September 13, 2025
ఖమ్మం జిల్లాలో 15 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బంద్

ఖమ్మం జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.