News September 24, 2025

ఇళ్లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్

image

పేదల ఇళ్ల గృహ నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోగా నిర్మించాలని కలెక్టర్ వెట్రిసెల్వి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస యోజన పధకం-1.O కింద పేదల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై కలెక్టరేట్ నుంచి మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లాకు కేటాయించిన 12 వేల 345 ఇళ్ల నిర్మాణ లక్ష్యానికి గాను, 10 వేల 240 ఇళ్లు పూర్తి చేయగా మిగిలిన 2105 వెంటనే పూర్తి చేయాలన్నారు.

Similar News

News September 24, 2025

కడప: ప్లాన్ ప్రకారమే వడ్డీ వ్యాపారి హత్య?

image

కడప జిల్లాలో వడ్డీ వ్యాపారి హత్య సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. అయితే వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డిని పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన నుంచి అప్పులు తీసుకున్న వారే హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

News September 24, 2025

GOLD: పదేళ్లలో దాదాపు రూ.లక్ష పెరిగింది

image

గతేడాది చివర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹72వేలుగా ఉండేది. ఇప్పుడు ₹1.16లక్షలకు చేరింది. అంటే 9 నెలల్లోనే ₹44వేలు పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం. 10గ్రా. బంగారం ధర 1970లో ₹184, 1975లో ₹540 మాత్రమే. 2005లో ₹7000 ఉండగా, 2015లో ₹26,343, 2020లో ₹50వేలు టచ్ చేసింది. కరోనా వల్ల ₹36వేలకు దిగొచ్చి తిరిగి పుంజుకుంది. పదేళ్లలో దాదాపు ₹లక్ష పెరిగింది.

News September 24, 2025

171 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

వివిధ విభాగాల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి CA/CWA/ICWA, పీజీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎమ్మెస్సీ, డిగ్రీ, ఎంబీఏతోపాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. వయసు 23-36 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 13. మరిన్ని వివరాలకు <>https://indianbank.bank.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.