News February 27, 2026
ఇళ్లు రాని వాళ్లంతా అప్లై చేసుకోవాలి: CBN

AP: పేదలందరికీ 2029 నాటికి ఉచితంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందిస్తామని CM CBN అసెంబ్లీలో వెల్లడించారు. ‘ఇళ్లు రాని వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలి. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవు. వారికి పట్టణ ప్రాంతాల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తాం ఈ ఏడాదిలో 10.63 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తాం. గత పాలకులు హౌసింగ్‌లో అక్రమాలు చేశారు. ఇందుకు బాధ్యులను శిక్షిస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 28, 2026
హైవేపై బండి ఆగిపోయిందా? ఇలా చేయండి!

నేషనల్ హైవేలపై ప్రయాణించేటప్పుడు మీ వాహనంలో పెట్రోల్ అయిపోయిందా? అలాంటి సమయంలో మీకు హెల్ప్ చేసేందుకు NHAI సిబ్బంది ఉన్నారనే విషయం మీకు తెలుసా? టోల్ ఫ్రీ నంబర్ ‘1033’కు కాల్ చేస్తే నిమిషాల్లోనే హెల్పింగ్ టీమ్ మీ వద్దకు చేరుకుంటుంది. డబ్బులు చెల్లించి 5 లీటర్ల వరకు పెట్రోల్/ డీజిల్ పొందవచ్చు. అలాగే ఇతర అత్యవసర సేవలు కూడా అందజేస్తారు. అన్ని రకాల వాహనాలకు ఈ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. SHARE IT
News February 28, 2026
రాజ్యసభ రేసులో LGBTQ.. ఎవరీ మేనకా గురుస్వామి?

మార్చి 16న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు TMC ప్రకటించిన జాబితాలో మేనకా గురుస్వామి ఎంపిక అందరినీ ఆకర్షిస్తోంది. ఈమె సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. LGBTQ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) వర్గానికి చెందినవారు. హోమో సెక్సువాలిటీని నేరంగా పరిగణించే IPC సెక్షన్ 377ను సుప్రీం కొట్టేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె RSకు ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా రికార్డు సృష్టిస్తారు.
News February 28, 2026
విజయ్ అఫైర్ ఈమెతోనేనా?

తమిళ స్టార్ హీరో విజయ్‌కు ఒక నటితో <<19254560>>అఫైర్ <<>>ఉందని ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్‌లో పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ నటి పేరును ఆమె బయటపెట్టకపోయినా గతంలో విజయ్‌తో కలిసి నటించిన త్రిషతో ఆయనకు సంబంధం ఉందంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న కోర్టులో విజయ్ తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది.


