News April 12, 2025

ఇళ్ల ఎంపికలో జాప్యం వద్దు: భూపాలపల్లి కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి డీఆర్డీవో, డీఈఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం కాటారం డివిజన్‌లో లబ్ధిదారుల విచారణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News November 11, 2025

NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నవంబర్, డిసెంబర్ మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.

News November 11, 2025

సీఎం స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను: రామ్మోహన్‌రావు

image

నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి పెట్టుబడిదారుడిగా ఎదిగానని పారిశ్రామికవేత్త రామ్మోహన్‌రావు తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన CMతో వర్చువల్‌గా మాట్లాడారు. 2017 CIIసదస్సులో CM సమక్షంలో MOU కుదిరిందని, అప్పటి నుంచి చంద్రబాబు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 5 వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.

News November 11, 2025

HYD: మరో 10 రాష్ట్రాలకు విస్తరించనున్న సింగరేణి

image

సింగరేణి కంపెనీ 10 రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించి, సింగరేణి గ్రీన్ ఎనర్జీ, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ ద్వారా 5,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థగా మారనుందని HYDలో ఎండీ బలరాం వెల్లడించారు. 40,000 మంది ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆధారపడి ఉన్న సింగరేణి భవిష్యత్తు శతాబ్దం పాటు సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు.