News July 8, 2025
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి: జనగామ కలెక్టర్

జనగామలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం పరిశీలించారు. 21వ వార్డు కుర్మవాడకు చెందిన దివ్యాంగుడు పర్ష సాయి కుటుంబానికి మంజూరైన ఇంటి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
ఏటూరునాగారం: ప్రభుత్వ భూమిని పరిశీలించిన కలెక్టర్

ఏటూరునాగారం మండలం ఎక్కేలా గ్రామంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం పర్యటించారు. గోదావరి వరద ప్రవాహం ముంపునకు గురయ్యే భూటారం ప్రజల కోసం ఎక్కేలా గ్రామంలో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. వీలైనంత త్వరగా స్థలాన్ని పరిశీలించి, నివేదికను అందించాలని కలెక్టర్ తహశీల్దార్‌కు సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ మహేందర్ ఉన్నారు.
News July 8, 2025
TTD ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్

AP: TTDలో పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) రాజశేఖర్ బాబు సస్పెండ్ అయ్యారు. తిరుపతి(D)లోని స్వగ్రామం పుత్తూరులో ఆయన ప్రతి ఆదివారం చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని TTDకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన TTD విజిలెన్స్ అధికారులు రాజశేఖర్ ఆలయ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని గుర్తించారు. ఇతర ఆధారాలూ పరిశీలించిన ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేశారు.
News July 8, 2025
తూ.గో: రేపు దేశవ్యాప్త సమ్మె

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని గోపాలపురం ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సమ్మె పత్రాలను వైద్యులకు అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.