News December 22, 2025
ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం సమీక్షించారు. ఆప్షన్-3, PMAY 1.0 ఇళ్ల నిర్మాణాల్లో అజయ్ వెంచర్స్, పల్లా ఏసుబాబు, జి.వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి సత్వరమే లబ్ధిదారులకు అప్పగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తేదారులను హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 24, 2025
నేరాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బుధవారం తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు.
News December 24, 2025
పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక చొరవ చూపాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పెదమిరంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాలు ఆశాజనకంగా ఉన్నాయని, అదే స్థాయిలో పరిశ్రమలు వృద్ధి చెందాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.
News December 24, 2025
జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలిజేశారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. ఏసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడని, గొప్ప శాంతి దూత అని కొనియాడారు.


