News March 1, 2026
ఇవాళ్టి నుంచి దివ్యాంగులకు బస్సుల్లో ఫ్రీ జర్నీ

దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ‘ఇంద్రధనస్సు’ పథకం కింద ఇవాళ్టి నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ తరహాలోనే 40%, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. సదరం సర్టిఫికెట్ లేదా స్మార్ట్ కార్డ్ చూపించి జీరో టికెట్ పొందొచ్చు. ఇతర బస్సుల్లో పాత పద్ధతిలోనే 50% రాయితీ ఉంటుంది.
Similar News
News March 2, 2026
మ్యాగ్జిమం కిక్ కోసం కాఫీ ఎప్పుడు తాగాలంటే..

చాలామంది నిద్రలేవగానే బెడ్ కాఫీతో రోజును స్టార్ట్ చేస్తారు. కానీ కొన్ని స్టడీస్ ప్రకారం దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. మార్నింగ్ లేచిన ఒక గంట తర్వాత కాఫీ తాగితేనే ఎనర్జీ బూస్ట్ అవుతుందట. మధ్యాహ్నం 1-3 గంటల మధ్య వచ్చే డల్‌నెస్‌ను పోగొట్టడానికి కాఫీ బెస్ట్ ఆప్షన్. వర్కౌట్స్‌కి 30-60 నిమిషాల ముందు తీసుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు కాఫీకి దూరంగా ఉంటే నిద్ర డిస్టర్బ్ అవ్వదు.
News March 2, 2026
తెలుగు సినిమాకి తెలుగులో టైటిల్ ఏది?

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య నటిస్తున్న సినిమాకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లపై విమర్శలొస్తున్నాయి. మూవీ టీమ్ తమిళం, ఇంగ్లిష్‌లోనే పోస్టర్లు రిలీజ్ చేసింది. తెలుగులో టైటిల్ పోస్టర్ ఇవ్వలేదు. దీంతో తెలుగు టైటిల్ ఎందుకు లేదు? తెలుగంటే నిర్లక్ష్యం ఎందుకు? అంటూ తెలుగు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
News March 2, 2026
22,195 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<


