News November 21, 2025

ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం

image

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ మొదలుకానుంది. క్రికెట్‌లో భారత్-పాక్ పోరు తర్వాత ఆ స్థాయిలో జరిగే ఏకైక సిరీస్ యాషెస్ మాత్రమే. 2010-11 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అక్కడ జరిగిన గత 3 సిరీస్‌లలో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోరంగా ఓడింది. ఓవరాల్‌గా యాషెస్‌లో ఆసీస్‌దే పైచేయి కావడం గమనార్హం.

Similar News

News November 23, 2025

HYD: వీకెండ్‌ పార్టీ.. రోడ్డెక్కితే దొరికిపోతారు!

image

వీకెండ్ వస్తే మందుబాబులు వైన్స్, బార్‌లు, పబ్‌లో చిల్ అవుతారు. తాగిన మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా HYD పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందల మంది పట్టుబడ్డారు. వాహనాలు సీజ్ అయ్యాయి. కౌన్సెలింగ్, కోర్టుకెళ్లి జరిమానా కట్టాల్సిన పరిస్థితి. D & D డేంజర్ అని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా తనిఖీల్లో దొరికి తలలు పట్టుకుంటున్నారు.

News November 23, 2025

ఏపీ టెట్.. కొన్ని గంటలే గడువు

image

AP TET దరఖాస్తులకు కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇవాళ 11.59PMలోపు అప్లై చేసుకోవాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు 2L మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 3న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. DEC 10 నుంచి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. JAN 19న ఫలితాలు వెల్లడిస్తారు.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/

News November 23, 2025

వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

image

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.