News March 1, 2026
ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా!

ఇవాళ HYDలో బంగారం, వెండి ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,68,710, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,650గా ఉంది. కేజీ వెండి ధర రూ.3,20,000 పలుకుతోంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రేపు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
Similar News
News March 1, 2026
ఇవాళ్టి నుంచి దివ్యాంగులకు బస్సుల్లో ఫ్రీ జర్నీ

దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ‘ఇంద్రధనస్సు’ పథకం కింద ఇవాళ్టి నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ తరహాలోనే 40%, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. సదరం సర్టిఫికెట్ లేదా స్మార్ట్ కార్డ్ చూపించి జీరో టికెట్ పొందొచ్చు. ఇతర బస్సుల్లో పాత పద్ధతిలోనే 50% రాయితీ ఉంటుంది.
News March 1, 2026
ఇరాన్ బెదిరింపులు.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికాపై ప్రతీకార <<19268566>>దాడి<<>> చేస్తామన్న ఇరాన్ బెదిరింపులపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ‘ఇవాళ భీకర దాడి చేస్తామని ఇరాన్ బెదిరించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అటాక్ చేస్తామంది. ఇరాన్ ఆ పని చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఆ పని చేస్తే మేం చేసే దాడి మామూలుగా ఉండదు. గతంలో ఎన్నడూ చూడని విధంగా మా బలగాలను రంగంలోకి దించాల్సి వస్తుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.
News March 1, 2026
APPLY NOW: HURLలో 40 పోస్టులు

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్(HURL)లో 40 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 2 రోజులే(మార్చి 3) సమయం ఉంది. పోస్టును బట్టి BSc(అగ్రి), MSc, BTech, MBA/PGDBM, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజినీర్ పే స్కేల్ రూ.40,000 -రూ.1,40,000, Asst. మేనేజర్‌కు రూ.50,000-రూ.1,60,000, Jr. Engg. Asst.కు రూ.25,000-రూ.86,400 ఉంది. సైట్: hurl.net.in/


