News February 19, 2026

ఇవాళ జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమల కల్తీ నెయ్యి అంశం, హెరిటేజ్ ఇష్యూ, మండలిలో చర్చకు వచ్చిన పలు అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.

Similar News

News March 9, 2026

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?

image

తిన్న తర్వాత బాడీ ‘డైజెషన్ మోడ్’లోకి వెళ్తుంది. రక్తం అంతా పొట్ట దగ్గరకు చేరి ఆహారాన్ని అరిగించే పనిలో ఉంటుంది. అలాంటి టైమ్‌లో వెంటనే స్నానం చేస్తే బాడీ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడం కోసం బ్లడ్ సర్క్యులేషన్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోయి.. కడుపు ఉబ్బరం, హెవీనెస్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. అందుకే తిన్న తర్వాత 30 నుంచి 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి స్నానం చేస్తే బెస్ట్.

News March 9, 2026

భవిష్యత్తులోనూ తప్పులు జరగకుండా పాస్ పుస్తకాలు: సీఎం

image

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని CM CBN చెప్పారు. YCP హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది QR కోడ్‌తో పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. నంద్యాల(D) కొత్తబురుజులో రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భవిష్యత్తులోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని తెలిపారు.

News March 9, 2026

వడదెబ్బ మృతులకు ₹4లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే?

image

TG: వేసవిలో వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు GOVT ₹4 లక్షల పరిహారం అందించనుంది. గతంలో ఇది ₹50,000 మాత్రమే. SDMA గత ఏడాది ఈ మొత్తాన్ని పెంచింది. వడదెబ్బ మరణాలను మండల స్థాయిలో రెవెన్యూ, ఆరోగ్య, పోలీసు శాఖల అధికారుల కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. కనుక ఎవరైనా వ్యక్తులు వడదెబ్బతో చనిపోయినట్లయితే తప్పనిసరిగా పోస్ట్‌మార్టం జరిపించాలి. డెత్ సర్టిఫికెట్, పంచనామా రిపోర్టు ఆధారంగా దరఖాస్తు చేయాలి.