News January 18, 2026

ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి

image

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.

Similar News

News February 21, 2026

ప్రకాశం: బిల్లు చెల్లిస్తేనే డెడ్ బాడీని అప్పగిస్తారంట..!

image

నరసరావుపేటలోని ఓ ప్రముఖ గుండె వైద్యశాలలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు (M) కుందుర్తికి చెందిన సాతులూరి పెద్ద ఏడుకొండలు గుండె జబ్బుతో వైద్యశాలలో చేరాడు. నొప్పి తీవ్రం కావడంతో ఏడుకొండలు మృతి చెందాడు. వైద్యశాల యాజమాన్యం మాత్రం బిల్లులు పూర్తిగా చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని పట్టు పట్టడంతో మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు వైద్యశాల వద్ద ఆందోళన చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

News February 21, 2026

ప్రకాశం: మాల్ ప్రాక్టీస్‌కు చెక్.. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

image

ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. 79 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రశ్నపత్రాల రవాణా, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత, CC కెమెరాలు, డ్రోన్ నిఘా ఏర్పాటువంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News February 21, 2026

చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

image

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.