News April 4, 2026

ఇవాళ, రేపు జాగ్రత్త!

image

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.

Similar News

News April 8, 2026

ఇరాన్‌లో US పైలట్‌ను కనిపెట్టిన ‘ఘోస్ట్ మర్మర్’

image

ఇరాన్‌లో F-15E <<19570876>>పైలట్‌ను కాపాడటానికి<<>> US CIA ‘ఘోస్ట్ మర్మర్’ అనే టెక్నాలజీని వాడింది. ఇది కొన్ని KM దూరం నుంచి మనిషి గుండె చప్పుడును పసిగడుతుంది. మనిషి గుండె కొట్టుకున్నప్పుడు బాడీ నుంచి తక్కువ స్థాయిలో విద్యుదయస్కాంత కిరణాలు రిలీజ్ అవుతాయి. ‘క్వాంటం మాగ్నెటోమెట్రీ’ టెక్నాలజీని వాడే ‘ఘోస్ట్ మర్మర్’ ఆ వీక్ సిగ్నల్స్‌ను పసిగడుతుంది. AI సాయంతో చుట్టుపక్కల నాయిస్ నుంచి గుండె చప్పుడును వేరు చేస్తుంది.

News April 8, 2026

ఎన్టీఆర్-నీల్ మూవీపై రూమర్లను నమ్మొద్దు: నిర్మాతలు

image

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై వస్తున్న రూమర్లను నిర్మాతలు ఖండించారు. షెడ్యూల్ క్యాన్సిల్ కాలేదని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ స్పష్టం చేశాయి. సాధారణంగా ప్రిపరేషన్ గ్యాప్ వచ్చిందని, ప్లాన్ ప్రకారం మూవీ షూటింగ్ జరుగుతోందని పేర్కొన్నాయి. చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనలన్నీ తామే వెల్లడిస్తామని తెలిపాయి.

News April 8, 2026

ఇరాన్ షరతులు.. US ఒప్పుకుందా?

image

ఇరాన్ చేసిన 10 ప్రతిపాదనలను పాకిస్థాన్ అమెరికా ముందుంచింది. వీటిని US అంగీకరించిందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెబుతోంది. కానీ ఇంకా వాటిపై చర్చలు జరగలేదు. ఈ నెల 10న పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు జరపనున్నాయి. అప్పటివరకు సీజ్‌ఫైర్ అమల్లో ఉండనుంది.