News March 19, 2024

‘ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ సముద్ర ఖని’

image

శ్రీశైలానికి 20 కి.మీ దూరం గల దట్టమైన అభయారణ్యంలో వెలసిన కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారిని సినీ దర్శకులు సముద్ర ఖని మంగళవారం దర్శించుకున్నారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన ముందుగా నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి దేవాలయాన్ని సందర్శించి అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట స్థానికుడు కోటి ఉన్నారు.

Similar News

News September 16, 2025

కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

image

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.

News September 15, 2025

పూర్వ విద్యార్థుల సాయం హర్షణీయం: MP

image

KNL: పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. నగరంలోని రాక్ వుడ్ మెమోరియల్ పాఠశాలలో 1976-1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. ఎంపీ పాల్గొని ఆరోజులను గుర్తు చేసుకున్నారు. రాక్ వుడ్ పాఠశాలను తిరిగి స్కూల్, లేదా స్టడీ సర్కిల్‌గా ఏర్పాటు చేసేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారని, తన వంతు సాయం చేస్తానని చెప్పారు.

News September 15, 2025

ఉద్యోగాల పేరుతో మోసపోకండి: కర్నూలు SP

image

ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని.. పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు ఉన్నారు.