News December 30, 2025

ఇష్టారాజ్యంగా ఛార్జీల వసూళ్లు.. కలెక్టర్ సీరియస్

image

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తుల వద్ద అద్దె గదుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. జాతర సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని అదనంగా వసూలు చేయకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక కమిటీ వేస్తామని RDO రాధాబాయి ఈ సందర్భంగా అన్నారు.

Similar News

News December 31, 2025

చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేను నియంత్రణ ఎలా?

image

చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేనును నియంత్రించేందుకు లీటరు నీటికి వేపనూనె 10,000 P.P.M 3ml కలిపి పిచికారీ చేయాలి. ఇది పిచికారీ చేసిన 7 రోజుల తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 S.L 0.6ml లేదా నోవల్యూరాన్ 10 E.C. 0.4 ml లేదా థయోమిథాక్సామ్ 25 W.G 0.3గ్రా కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పురుగు ఉద్ధృతిని బట్టి మందును మార్చి పిచికారీ చేయాలి. మొక్కలు పూతపై ఉంటే థయోమిథాక్సామ్ పిచికారీ చేయకూడదు.

News December 31, 2025

ఆసిఫాబాద్ ఎక్సైజ్ అధికారుల సూచన

image

డిసెంబర్ 31 సంబరాల్లో మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈవెంట్స్ నిర్వహించే వారు ఎక్సైజ్ శాఖ అనుమతి పత్రం పొందాలని, అనుమతి లేని చోట మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం విక్రయాల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు వివరించారు.

News December 31, 2025

సంగారెడ్డి: కొత్త సంవత్సరం వేళ లింక్స్ ఓపెన్ చేయొద్దు

image

కొత్త సంవత్సరం పురస్కరించుకొని అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కలర్ ఫల్ గ్రీటింగ్స్ అంటూ మార్వెల్ లింక్స్ పంపిస్తారని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కి ఫోన్ చేయాలన్నారు.