News November 11, 2024
ఇసుకను నిర్ణయించిన ధరకే విక్రయించాలి: మంత్రి దుర్గేశ్
సామాన్య ప్రజలు, భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి దుర్గేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కొంతమంది ఇసుకను ఉచితంగా కాకుండా లాభాపేక్షతో ఎక్కువ ధరకు విక్రయించడం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఇసుకకు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 13, 2024
పెద్దాపురం: కిడ్నాపర్ నుంచి బాలికను రక్షించిన పోలీసులు
పెద్దాపురం పరదేశమ్మ కాలనీ వద్ద కిడ్నాపర్ నుంచి ఓ బాలికను పెద్దాపురం పోలీసులు బుధవారం తెల్లవారుజామున రక్షించారు. ఇటీవల HYD మియాపూర్‌లో కిడ్నాప్ చేసి పెద్దాపురం పరదేశమ్మ పేటలో బాలికను నిర్బంధించినట్లు ఒక ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశామన్నారు. కొత్త ఆనంద్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని, ఘటనపై డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News November 13, 2024
తూ.గో జిల్లాలో ఇసుక ధరలు ఇవే
తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రీచ్‌ల వారీగా ఇసుక ధరల వివరాలను జిల్లా గనుల, భూగర్భ శాఖ మంగళవారం ప్రకటించింది. వేమగిరి, కడియపులంకలో రూ.61.37, వంగలపూడి 1,2లలో రూ 70.19, 67.59, ములకలలంక, కాటవరంలలో రూ.61.36, తీపర్రు రూ.96.02, ముక్కామల 2 రూ.116.49, కాకరపర్రు 117.02, పందలపర్రు రూ.104.42గా నిర్ణయించారు. ఈ ధరలకు మించి వసూలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.
News November 12, 2024
నేను వైసీపీని వీడట్లేదు: MLC రవీంద్రబాబు
వైసీపీని తాను వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఖండించారు. కాకినాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీను వీడాల్సిన అవసరం తనకు లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలతోపాటు దళితులకు కూడా పెద్దపీట వేసిన వైసీపీ అధినేత జగన్‌తోనే తన ప్రయాణమని ఆయన స్పష్టం చేశారు.