News October 21, 2025

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ఒంగోలు క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత,‌ రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డుల్లో అందుబాటులో ఉంచడం తదితర అంశాలను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News October 22, 2025

ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

జరుగుమల్లి నుంచి కొందరు అక్రమంగా ఇసుకను ఒంగోలుకు తరలిస్తున్నారని ఫలితంగా ఒంగోలులో ఇసుక యార్డుల నుంచి సరఫరా చేసే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ రాజా బాబుకు రవాణాదారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయా వనరుల నుంచి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు.

News October 22, 2025

విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి..

image

పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్ పై గ్రామానికి వెళ్తున్న తండ్రి, కొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య (60), మాదాల వెంకటేశ్వర్లు (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News October 21, 2025

ప్రకాశం జిల్లా ‘పోలీస్ సింగం’ ఈయనే.!

image

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఎందరో పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తూ అమరులయ్యారు. వారిలో ఒంగోలుకు చెందిన జాన్ వెస్లీ IPS ఒకరు. ఈయన YS రాజశేఖర్‌రెడ్డి భద్రతా అధికారిగా విధులు నిర్వహించారు. 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో YSRతో సహా జాన్‌వెస్లీ విధినిర్వహణలోనే ప్రాణాలు విడిచారు.