News September 20, 2025
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు 15 చెక్ పోస్టులు

KMM: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక అక్రమ రవాణా నియంత్రించడానికి జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. 24 గంటల పర్యవేక్షణ కోసం 3 షిఫ్టులలో సిబ్బంది పనిచేస్తారన్నారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు, స్థానిక పోలీస్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల సమన్వయంతో అక్రమ ఇసుక వాహనాల జప్తు, కేసులు నమోదు చేస్తూ నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 20, 2025
అక్టోబర్ నాటికి భూసేకరణ పూర్తి చేస్తాం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం: జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణా రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 163జీ, రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ హైవే, ఎన్‌హెచ్65 వంటి ప్రాజెక్టుల భూసేకరణలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి ఖమ్మం జిల్లాలో 42 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
News September 20, 2025
ఖమ్మం: మైనారిటీ మహిళలకు 2 కొత్త పథకాలు

మైనారిటీల కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రారంభించిందని జిల్లా సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా పథకాలకు మైనారిటీ, దూదేకుల, ఫకీర్లు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. అక్టోబర్ 6 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని, ఇతర వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News September 20, 2025
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

వానాకాలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 326 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 275 సన్నరకాలకు, 51 దొడ్డు రకాలకు ఉంటాయి. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొనుగోళ్లు జనవరి వరకు కొనసాగుతాయి. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మాల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.