News September 6, 2025
ఇసుక డంపింగ్‌లు కొత్తవి.. బిల్లులు మాత్రం పాతవి

కృష్ణా జిల్లాలో 7 చోట్ల అధికారిక ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నప్పటికీ, తోట్లవల్లూరు (M)లో ఇసుక అక్రమాలు భారీగా జరుగుతున్నాయి స్థానికులు ఆరోపించారు. కృష్ణా నది నుంచి తోడిన ఇసుకను రొయ్యూరు, వల్లూరుపాలెంలోని ప్రైవేట్ ప్రాంతాల్లో నిల్వచేశారన్నారు. 2024 నాటి వే బిల్లులు చూపిస్తూ రవాణా చేస్తున్నారని చెప్పారు. ఆర్డర్ ఐడీ, ట్రిప్ నెంబర్, కస్టమర్ పేరు, అడ్రస్ వంటి నకిలీ ఓచర్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 6, 2025
మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు: ఎస్పీ విక్రాంత్ పాటిల్

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే వస్తాయని, మధ్యవర్తుల ద్వారా రావని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో యువత జాగ్రత్త వహించాలని తెలిపారు.
News September 6, 2025
బాలాపూరా మజాకా.. ఏటా పెరుగుతున్న క్రేజ్

హైదరాబాద్‌లోని బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకుంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా, రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉంటారని భక్తుల నమ్మకం. 1994లో రూ.450తో మొదలై ఏటా పెరుగుతూ రూ.35లక్షలకు చేరింది. మొదటి నుంచి 21kgల లడ్డూను స్వామికి సమర్పిస్తున్నారు. 1998లో రూ.51వేలు పలికిన ధర 2002లో తొలిసారి రూ.లక్ష దాటింది. 2008లో రూ.5L, 2015లో రూ.10L క్రాస్ చేసింది. 2020లో కొవిడ్ వల్ల వేలం జరగలేదు. గతేడాది రూ.30.01 లక్షలు పలికింది.
News September 6, 2025
యాదాద్రి: ఫ్లోరైడ్ నిర్మూలనకు జిట్టా కృషి..

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రథమ వర్ధంతిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుపుకున్నారు. వలిగొండ రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందని వక్తలు కొనియాడారు. జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన గొప్ప నాయకుడు జిట్టా అన్నారు. వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.