News November 10, 2024

ఇస్తాంబుల్ సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి

image

టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. ప్రపంచ పర్యావరణ మార్పులు.. వాటి పరిణామాలపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గ్రీన్ జోన్లలో మరింత పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాలపై చర్చలు జరిగాయి.

Similar News

News November 13, 2024

కడప జిల్లా ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం

image

రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్ విప్‌తోపాటు శాసనసభ, మండలి విప్‌లుగా 15 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డిని శాసనసభ విప్‌గా నియమించారు. అయితే TDP నుంచి 15 మందికి, జనసేనలో నలుగురికి చోటు దక్కింది. కాగా BJP నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి మాత్రమే నిలిచారు. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

News November 13, 2024

బుకింగ్ కేంద్రాల్లో ఇసుక పంపిణీ పారదర్శకంగా జరగాలి

image

నిర్దేశించిన ఇసుక పంపిణీ సజావుగా జరగాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కడప కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక సరఫరా సంబంధిత అంశాల సమాచారం కోసం 08562246344 అనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్డీవో తమ పరిధిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రతి స్టార్ట్ పాయింట్లో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.

News November 13, 2024

సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండండి: కడప ఎస్పీ

image

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు తెలిపారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే పోస్టులు ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడదని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగానూ.. పార్టీల మధ్య చిచ్చులు పెట్టేలాంటి పోస్టులకు దూరంగా ఉండాలని కోరారు. మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.