News November 30, 2024
ఇస్తేమాకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం: కలెక్టర్
ఇస్తేమాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆత్మకూరులో జనవరిలో జరగనున్న ఉమామి తబ్లిగే ఇస్తేమా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. మత పెద్దలు కమిటీలను ఏర్పాటు చేసుకుని, అందరి సహకారంతో పనులు చేసుకోవాలన్నారు. ఏమైనా సౌకర్యాలు కావాలంటే తమకు తెలపాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని మత పెద్దలను కోరారు.
Similar News
News November 30, 2024
KNL: 153 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు నోటీసులు
హౌసింగ్‌కు సంబంధించి పురోగతి చూపని 153 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నోటీసులు పొందిన వారి వివరణల్లో సరైన కారణం లేకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లతో పీడీ హౌసింగ్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు సమావేశం ఏర్పాటు చేసుకొని ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేయాలన్నారు.
News November 30, 2024
ఎమ్ఎస్ఎమ్ఈ సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్
ఎంఎస్ఎంఈ సర్వేను వేగవంతం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంఎస్ఎంఈ సర్వే, హౌసింగ్, ఉపాధి హామీ, పీజీఆర్ఎస్, రీసర్వే, తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నుంచి సర్వే ప్రారంభం అయ్యిందని, వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 30, 2024
గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి: కలెక్టర్
కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే శుక్రవారం నుంచి ప్రారంభం అయిందన్నారు. ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోందని, సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. సాగు నీటి సంఘాల ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్నారు.