News April 10, 2025
ఇస్రోకు ఎంపికైన పల్నాడు విద్యార్థి

పల్నాడు జిల్లా విజయపురి సౌత్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి వెంకట నాగరాజు ఇస్రో యువికా-2025 కార్యక్రమానికి ఎంపికయ్యాడు. బుధవారం జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు నాగరాజును సన్మానించి అభినందించారు. రాష్ట్రం నుంచి పదిమంది విద్యార్థులు ఇస్రోకు ఎంపిక కాగా, అందులో పల్నాడు జిల్లాకు చెందిన విద్యార్థి ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
IRCTC వాలెట్‌తో బోలెడు ప్రయోజనాలు

IRCTC E-వాలెట్‌లో జమ చేసిన డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనివలన ప్రయాణికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తత్కాల్ టికెట్లు కేవలం సెకన్లలోనే బుక్ అవుతాయి. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా, బుకింగ్ కాకపోయినా రిఫండ్ డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. అదే సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే రోజుల తరబడి వేచి చూడాలి.
News December 20, 2025
కాంగ్రెస్ తీరుపై ఎమ్మెల్యే కూనంనేని అసంతృప్తి..!

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వైఖరిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పొత్తు ఉంటుందని భావిస్తే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. తాము కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నచోట పోటీకి దూరంగా ఉన్నామని, కానీ సీపీఐ బరిలో ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ తన మద్దతుదారులను నిలబెట్టడం శోచనీయమన్నారు.
News December 20, 2025
దేశంలో అతి తక్కువ ఫెర్టిలిటీ రేటు ఎక్కడంటే?

భారత్‌లో టోటల్ ఫెర్టిలిటీ రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా సిక్కిం (1.1) నిలిచింది. బిహార్‌లో(3.0) అత్యధిక ఫెర్టిలిటీ రేటు ఉంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నట్లు కేంద్రం ఇటీవల వెల్లడించింది. ఈ అంశంలో జాతీయ సగటు 2.0 కాగా అంతకంటే తక్కువగా TGలో 1.8, APలో 1.7గా ఉంది. అంటే ఒక మహిళ తన లైఫ్ టైమ్‌లో సగటున ఇద్దరి కంటే తక్కువ మందికి జన్మనిస్తోందని అర్థం.


