News February 24, 2025
ఇస్రో నుంచి యువికా 2025 కు దరఖాస్తు చేసుకోండి

పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరుతో యువిక -2025 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. సోమవారం నుంచి మార్చి 23 దాకా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. 8వ తరగతి ఉత్తీర్ణులై 9వ తరగతి చదువుతున్న వారు అర్హులు. https//jigyasa.iirs.gov.in/yuvika అనే సైట్ లో అర్హత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో కోరింది.
Similar News
News July 4, 2025
అల్లూరి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేద్దాం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సూచించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా యువజన సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News July 4, 2025
మహనీయుల సేవలను స్మరించుకోవాలి: కలెక్టర్

మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో
శుక్రవారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇరువురి మహనీయుల చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
News July 4, 2025
CUET(UG) ఫలితాలు విడుదల

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(అండర్ గ్రాడ్యుయేషన్)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <