News April 10, 2025
ఇస్రో యువికా ప్రోగ్రామ్‌లో గుంటూరు జిల్లాకు గౌరవం

ఇస్రో నిర్వహిస్తున్న యువికా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌లో గుంటూరు జిల్లా నుంచి వట్టిచెరుకూరు (మ) ముట్లూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పవన్ దుర్గ, ఓ ప్రవేట్ స్కూల్ విద్యార్థి వి. సోమశేఖర్ ఎంపికయ్యారు. మూడున్నర లక్షల మందికిపైగా పోటీలో పాల్గొనగా ఈ ఇద్దరు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ బుధవారం అభినందించారు. మే 18 నుంచి 31 వరకూ శ్రీహరికోటలో జరిగే శిక్షణలో వీరు పాల్గొంటారు.
Similar News
News February 16, 2026
రాజధానిలో రాత్రి వేళ అందని వైద్యం..!

తుళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో రాత్రైతే వైద్యులు ఉండటంలేదని రోగులు అంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులతో పాటు స్థానిక ప్రజలు రాత్రివేళలో వైద్యశాలకు వెళితే సరైన వైద్యం అందించే నాధుడు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. రాత్రి సమయంలో ఆరోగ్య కేంద్రం వైద్యానికి దూరంగా ఉంటుందంటున్నారు. సమస్యపై ప్రజా ప్రతినిధులకు ఏ కరువు పెట్టినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
News February 16, 2026
జిల్లాలో 4,71,937 మంది బాలలకు మాత్రలు అందిస్తాం: DMHO

జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న 4,71,937 మంది బాలబాలికలకు మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కే విజయలక్ష్మి తెలిపారు. అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల ద్వారా మాత్రలు అందిస్తామన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు తీసుకోవాలని సూచించారు. 17న తీసుకోని వారు 24న మాప్-అప్ రౌండ్‌లో తప్పక తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News February 16, 2026
మంగళగిరి: ఘాట్ రోడ్ సమయపాలనలో మార్పులు

ఘాట్ రోడ్‌లో ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని కొండ వెనుక ఉన్న ఘాట్ రోడ్ సమయపాలనలో మార్పులు చేసినట్లు దేవస్థాన అధికారి సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. అమావాస్య సందర్భంగా మంగళవారం గండాలయ్య స్వామి దర్శనానికి కొండ వెనుక ఘాట్ రోడ్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామన్నారు. కొండపై ప్లాస్టిక్ వస్తువులను నిషేధించామన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.


