News September 6, 2025

ఈఎంఆర్‌ఎస్ క్రీడా పోటీలు పకడ్బందీగా నిర్వహించాలి: మంత్రి

image

EMRS క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగిన 5వ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.

Similar News

News September 7, 2025

WGL: పోలీస్ అధికారులకు అభినందనలు

image

గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించినందుకు పోలీసులకు, ఇతర ప్రభుత్వ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించినందుకు గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో శ్రమించిన ప్రతి ఒక్కరి పనిని ఆయన అభినందించారు.

News September 7, 2025

చంద్రగ్రహణం.. తెరిచే ఉండనున్న శ్రీకాళహస్తి ఆలయం

image

AP: చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూసివేస్తే శ్రీకాళహస్తి టెంపుల్ మాత్రం తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో నవగ్రహ అలంకార కవచం వల్ల గ్రహణ ప్రభావం గుడిపై పడదని పండితులు చెబుతున్నారు. రోజులాగే రాత్రి 9 గంటలకు టెంపుల్ మూసివేసి, గ్రహణ సమయంలో రాత్రి 11 గంటలకు తెరిచి గ్రహణకాల అభిషేకాలు, శాంతిపూజలు నిర్వహిస్తారు. అయితే భక్తులకు రేపు ఉదయం 6 గంటలకు దర్శనం కల్పిస్తారు.

News September 7, 2025

ఆసిఫాబాద్: ఆకాశంలో విఘ్నేశ్వరుడి రూపం..!

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని హనుమాన్ బస్తీలో అద్భుతం జరిగింది. వినాయక నిమజ్జనాలు ఉండగా ఆకాశంలో విఘ్నేశ్వరుడి రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు ఆకాశంలోని వినాయక రూపాన్ని చూసి గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. స్వామివారి నిజ దర్శనం జరిగిందన్నారు. అక్కడే ఉన్న పలువురు యువకులు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు.