News February 6, 2025
‘ఈగల్’ వింగ్ విశాఖ సీఐగా ఎస్.రమేశ్
విశాఖపట్నం జిల్లా జోనల్ “ఈగల్” వింగ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా ఎస్.రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1972కి డయల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈయన విశాఖ జిల్లాలో 2010 నుంచి 2022 వరకు పలు విభాగలలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.
Similar News
News February 6, 2025
భీమిలి: ఇన్‌స్టాలో పవన్‌ను తిట్టిన వ్యక్తిపై కేసు
తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో Dy CM పవన్ కళ్యాణ్‌ను తిడుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన భీమిలి మండలం జీరుపేట గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 2న జీరు వీరుబాబు పెట్టిన పోస్టుపై విజయవాడకు చెందిన TDP బూత్ కన్వీనర్ హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసుల సాయంతో గవర్నర్‌పేట పోలీసులు వీరబాబును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News February 6, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తీరనున్న ఐరన్ ఓర్ కొరత
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ కొరత తీరనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్‌కు పూర్తిస్థాయిలో ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ అధికారులు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి మూడో బ్లాస్ట్ ఫర్నెస్ ప్లాంట్ ఉపయోగంలోకి తీసుకురానున్నారు. మొత్తంమీద స్టీల్ ప్లాంట్‌కు కొంత ఊపిరి అందిస్తున్నారు.
News February 6, 2025
గోపాలపట్నంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి
గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కొత్తపాలెం ఆదర్శనగర్‌కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీ(26)గా గుర్తించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం షిప్ యార్డులో అప్రెంటీస్ చేస్తున్నాడు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అప్పలనాయుడు చేరుకుని విచారణ ప్రారంభించారు.