News January 2, 2026

ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

image

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్‌లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్‌, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్‌ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.

Similar News

News January 2, 2026

పల్నాడు కలెక్టర్‌ను ప్రశంసించిన చంద్రబాబు

image

పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్లాను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్‌లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.

News January 2, 2026

AMPRIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో 13 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 4 ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ(సైన్స్, CS), టెన్త్, ఐటీఐ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.66,500, టెక్నీషియన్‌కు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in

News January 2, 2026

‘సిగాచి’ బాధితుల నష్టపరిహారంపై విచారణ

image

సిగాచి ప్రమాద మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.1 కోటి పరిహారంలో రూ.58 లక్షలు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టుకు ఫార్మా తరఫు న్యాయవాదులు తెలిపారు. జూన్ 30న జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన 54 మంది కార్మికుల పరిహార పిటిషన్ విచారణలో, కంపెనీ తన వంతుగా రూ.42 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కొంత మొత్తం చెల్లించామని, మిగతా పరిహారాన్ని మార్చిలోపు చెల్లిస్తామన్నారు.