News March 31, 2026

ఈనాటి ముఖ్యాంశాలు

image

➤ భారత్ ఇప్పుడు మావోయిస్టు రహిత దేశం: అమిత్ షా
➤ SSY, PPF వడ్డీ రేట్లు యథాతథం
➤ భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్
➤ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CBNకు ఊరట
➤ మావోయిస్టు ఫ్రీ రాష్ట్రంగా ఏపీ: DGP
➤ సన్నబియ్యంతో లంచ్ చేసిన సీఎం, TG MLAలు
➤ KCRను గృహ నిర్బంధం చేశారని నా అనుమానం: CM రేవంత్
➤ IPL: RRపై చిత్తుగా ఓడిన CSK

Similar News

News April 13, 2026

విద్యావ్యవస్థను లోకేశ్ గాలికొదిలేశారు: వైసీపీ

image

AP: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ఫీజులు ఇప్పుడు కడతారా.. ఆ తర్వాత వడ్డీతో కలిపి కడతారా? అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నాయి. విద్యావ్యవస్థను గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేశ్ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

News April 13, 2026

చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

image

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

News April 13, 2026

కొత్త ఎల్పీజీ కనెక్షన్ల మంజూరు నిలిపివేత

image

TG: LPG సరఫరాలో సమస్యతో గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త కనెక్షన్ల మంజూరును ఆయిల్ కంపెనీలు నిలిపేశాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియనూ ఆపేశాయి. ఇప్పటికే అందిన అప్లికేషన్లను సైతం పెండింగ్ పెట్టాయి. ‘మహాలక్ష్మి’ స్కీమ్ దరఖాస్తులదీ అదే స్థితి. కంపెనీలు ఆమోదించకపోతుండడంతో GOVT కూడా వీటిని ఆపేసింది. ఇరాన్-US యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడటమే ఈ పరిస్థితికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారు.