News March 5, 2026
ఈనెల 10న అమలాపురంలో జాబ్ మేళా

అమలాపురం: పట్టణంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఈనెల 10న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రముఖ సంస్థలలో వివిధ ఉద్యోగాలకు SSC, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Similar News
News April 15, 2026
TODAY HEADLINES

☛ అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
☛ రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు
☛ ‘మహిళా బిల్లు’.. జగన్‌కు చంద్రబాబు లేఖ
☛ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: రేవంత్
☛ ఎండలు.. ప్రజలు 11AM-3PM వరకు బయటకు రావొద్దు: సీతక్క
☛ బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి
☛ ఇరాన్‌తో రెండు రోజుల్లో మరోసారి చర్చలు: ట్రంప్
☛ IPL: KKRపై CSK విజయం
News April 15, 2026
విమానంలో ఫోన్ వాడితే డేంజరా?

విమానంలో ప్రయాణికుల ఫోన్లను కచ్చితంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోమంటారు. అలా చేయకపోతే డేంజరనే భయం కొందరిలో ఉంటుంది. అయితే ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో లేనంత మాత్రాన ప్లేన్ కూలిపోదని, కానీ కొంత రిస్క్ ఉందంటున్నారు పైలట్లు. ‘ఫ్లైట్ మోడ్‌లో లేకుంటే ఫోన్లు సిగ్నల్స్ రాబట్టేందుకు యత్నిస్తాయి. పైలట్ల హెడ్‌సెట్స్‌కు వచ్చే రేడియో వేవ్స్ డిస్ట్రబ్ అయ్యి శబ్దం వస్తుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది’ అని చెబుతున్నారు.
News April 15, 2026
హార్దిక్ నిర్ణయాలపై రోహిత్ సంతృప్తిగా లేరు: మాజీ క్రికెటర్

హార్దిక్ చెత్త నిర్ణయాల వల్లే RCB చేతిలో ముంబై ఓడిపోయిందని మాజీ క్రికెటర్ సడగొప్పన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘MIకి హార్దిక్ కెప్టెన్సీనే పెద్ద సమస్య. 7, 8వ ఓవర్లు వరుసగా స్పిన్నర్లకు ఇచ్చాడు. పాటీదార్ ఉన్నప్పుడు ఇలా చేయడం పెద్ద తప్పు. డేవిడ్‌కు హై ఫుల్ టాస్ వేసి DRSకు వెళ్లడంతో సూర్య షాకయ్యాడు. అటు రోహిత్ కూడా హార్దిక్ నిర్ణయాలపై సంతృప్తిగా లేనట్లు క్లియర్‌గా కనిపించింది’ అని తెలిపారు.


