News January 9, 2026

ఈనెల 10న పెద్ద కొమెరకు మందకృష్ణ మాదిగ రాక

image

గంపలగూడెం మండలం పెద్ద కొమెర గ్రామంలో ఈనెల 10న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల నుండి ఎస్సీ ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కరపత్రాల ద్వారా పిలుపునిచ్చారు.

Similar News

News February 22, 2026

నల్గొండలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించారు.

News February 22, 2026

WGL: నేడు గురుకుల ప్రవేశ పరీక్షలు

image

ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీసీఓ అపర్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కేంద్రాల్లో 3,933 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు హాల్ టికెట్లతో ఉదయం 10 గంటల వరకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

News February 22, 2026

తూ.గో: పసిపాపపై వృద్ధుడి అత్యాచార యత్నం

image

దేవరపల్లి మండలంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. పొగాకు బ్యారల్ క్యూరింగ్ పనుల కోసం వచ్చిన నేకూరి ఎలీషా (70) ఈ దారుణానికి యత్నించగా స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై గతంలోనూ పోక్సో కేసు ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.