News January 3, 2025

ఈనెల 10న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 10న వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 5:15 లకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించుటకు ఏర్పాటు కొనసాగిస్తున్నారు. అలాగే ఐదు రోజులపాటు అధ్యాయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి భాస్కరరావు తెలిపారు.

Similar News

News January 5, 2025

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కోమటిరెడ్డి

image

గర్భస్థ, శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్‌సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి ఆదివారం పూజ చేశారు.

News January 5, 2025

కేసీఆర్‌‌తో నల్గొండ జిల్లా నేతల భేటీ

image

ఉమ్మడి NLG జిల్లాకు చెందిన నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌‌లో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పై పోరాడేందుకు తొందర ఏం లేదని.. వేచి చూద్దామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు మాజీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.

News January 5, 2025

NLG: స్థానిక పోరుకు సన్నద్ధం…

image

NLG జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.