News January 3, 2025
ఈనెల 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు
పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌పై ఈ నెల 10 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News January 5, 2025
రొద్దం: వాట్సాప్ స్టేటస్ పెట్టి యువకుడి ఆత్మహత్య
శ్రీసత్యసాయి జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రొద్దం మండలం రాచూరుకు చెందిన సోమిరెడ్డి(28) యువకుడి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. చెల్లికి పెళ్లి కాగా అతను తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అప్పుడప్పుడు కారు డ్రైవింగ్‌కు వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ‘నా చావుకు నేనే కారణం’ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. కాసేపటికే రొద్దం-పెనుగొండ మార్గంలోని LGB నగర్ వద్ద చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.
News January 5, 2025
గొడిసెలపల్లికి 16 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు
డీ.హీరేహాళ్ మండలం గొడిసెలపల్లికి శనివారం RTC బస్సు వచ్చింది. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. ఉంది. 16 ఏళ్లుగా ఆ ఊరికి RTC బస్సు సర్వీసు లేదు. కలెక్షన్స్ తగ్గాయని అప్పట్లో బస్సును రద్దు చేశారు. అప్పటి నుంచి ఆటోలు, బైకులపై గ్రామస్థులు ప్రయాణాలు సాగిస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు పలుమార్లు వేడుకున్నారు. చివరికి రాయదుర్గం MLA శ్రీనివాసులు చొరవతో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు.
News January 5, 2025
లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై కలెక్టర్ సమావేశం
అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు పరిచే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టం పక్కాగా అమలు కావాలన్నారు.