News November 9, 2025
ఈనెల 11న ములుగులో ‘ఐక్యత పాదయాత్ర’

‘ఏక్ భారత్ – ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో ఈ నెల 11న ఉదయం ములుగులో జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. యువతలో దేశభక్తి, ప్రజల్లో సమైక్యతను పెంచేందుకు ఈ యాత్రను చేపట్టారు. ఉదయం 9:30 గంటలకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు జరిగే ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Similar News
News November 9, 2025
రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన.. సీఎంతో భేటీ!

AP: రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రెండు బృందాలుగా ఏర్పడి పరిశీలించనుంది. రేపు టీం-1: ప్రకాశం, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నష్టాలను అంచనా వేయనుంది. ఎల్లుండి టీం-1: బాపట్ల, టీం-2: కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
News November 9, 2025
లారీ ఢీకొని యువకుడు మృతి

బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన భట్టిప్రోలు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివయ్య వివరాల మేరకు.. రేపల్లె – గూడవల్లికి బైక్‌పై వెళ్తున్న మహమ్మద్ వలి (27) ని అదే దారిలో వస్తున్న లారీ సూరేపల్లి బ్రిడ్జి వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో వలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News November 9, 2025
జాతీయస్థాయి స్విమ్మింగ్‌కు హర్షవర్ధన్ రాజు ఎంపిక

విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తెనపల్లి ప్రగతి కళాశాల విద్యార్థి బి. హర్షవర్ధన్ రాజు స్వర్ణం, కాంస్యం పతకాలు సాధించాడు. ఈ ప్రతిభతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ఢిల్లీలో జరగనున్న 69వ నేషనల్ గేమ్స్‌కు అతడు ఎంపికయ్యాడు. విజయం సాధించిన హర్షవర్ధన్ రాజును కళాశాల యాజమాన్యం అభినందించింది.


