News September 11, 2025
ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: అనకాపల్లి డీఈవో

ఓపెన్ స్కూల్ ద్వారా దూరవిద్య విధానంలో పదవ తరగతి, ఇంటర్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అప్పారావు నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్ళు నిండినవారు పదవ తరగతిలో చేరి సెలవు దినాల్లో శిక్షణ పొంది పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. పదవ తరగతి పాస్ అయిన వారు కళాశాలలో చేరకుండా నేరుగా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పరీక్షలు రాయవచ్చునని అన్నారు.
Similar News
News September 11, 2025
మచిలీపట్నం-విజయవాడ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 11, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ శ్రీనివాసరావు

జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పాత ఇళ్లు, పూరి గుడిసెల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన కోరారు. గొర్రెల కాపరులు వాగులు, నదుల దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించారు. వర్షాల వల్ల ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీస్ స్టేషన్, డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 70306కు కాల్ చేయాలన్నారు.
News September 11, 2025
17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం: అమర్నాథ్

AP: వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నర్సీపట్నంలో కాలేజీని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రూ.500 కోట్లతో ఒక్కో కాలేజీ నిర్మాణం చేపట్టామని.. చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. పేదవాడికి వైద్యవిద్య అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తే బాబు వాటిని అమ్మేస్తున్నారని ఫైరయ్యారు.