News December 14, 2025

ఈనెల 16న కోదాడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక

image

డిసెంబర్ 25 నుంచి 28 వరకు కరీంనగర్‌లో నిర్వహించే సీనియర్స్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 16న కోదాడలోని కేఆర్‌ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహ రావు తెలిపారు. పూర్తి వివరాలకు 9912381165కు సంప్రదించాలన్నారు.

Similar News

News December 17, 2025

MDK: గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

image

చిన్నశంకరంపేట మండలం జంగరాయి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గుండెపోటుతో అస్పత్రిలో చేరిన సంజీవరెడ్డి మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు అస్పత్రిలో చేరారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News December 17, 2025

గుంటూరు ఎంపీ పనితీరుపై IVRS సర్వే

image

టీడీపీ MPల పనితీరుపై పార్టీ అధిష్ఠానం IVRS సర్వే చేపట్టింది. మంగళవారం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. 08645417579 అనే నెంబర్ నుంచి సర్వే జరిగింది. ఎంపీ పనితీరు బాగుంటే 1, లేకుంటే 2, చెప్పడం ఇష్టం లేకపోతే 3 నొక్కాలని సర్వేలో కోరారు. ఎంపీలుగా గెలిచి 18 నెలలు అయిన సందర్భంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మరి ప్రజల రెస్పాండ్ ఎలా ఉందో చూడాలి.

News December 17, 2025

నెల్లూరు: మేము ‘సై’.. కానీ మా ప్రాణాలకు రక్షనుందా.!

image

గంజాయి నిర్మూలనకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. యువత సైతం ముందుకు రావాలని DSP ఘట్టమనేని కోరారు. నగదు ప్రోత్సాహాన్ని సైతం ఆఫర్ చేస్తున్నారు. గంజాయి సమాచారం ఇస్తాం.. మరి మా ప్రాణాలకు రక్షణ ఇవ్వగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారట. పెంచలయ్య హత్యను వారు ఉదహరిస్తున్నారు. గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ యువతి సైతం అనంతరం ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. మరి పోలీసులు యువతకు భరోసా ఇస్తారా.? చూడాలి.