News April 12, 2024

ఈనెల 16న PUలో మహనీయుల జయంతి

image

ఈనెల 16న పాలమూరు విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. నాగం కుమారస్వామి తెలిపారు. వర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, భారత రత్న డా. బీఆర్. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా పులే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 1, 2024

MBNR: సర్వం సిద్ధం.. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన

image

డీఎస్సీ పలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ఎంపికైన అభ్యర్ధుల ఫోన్ కు SMS/మెయిల్ ఐడీకి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, 1:3 నిష్పత్తిలో DEOల వెబ్ సైట్ లో ఉంచుతామని డీఈవోలు తెలిపారు.

News October 1, 2024

“దేవద్రోణి తీర్థం” పుష్కరఘాట్‌లో ఘాతుక చతుర్దశి !

image

అలంపూర్ పుణ్యక్షేత్రం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న “దేవద్రోణి తీర్థం”లో మంగళవారం ఘాతుక చతుర్దశి చేస్తారు. మహాలయపక్షాల సందర్భంగా దేవద్రోణి తీర్థమైన పుష్కరఘాట్ లో ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని ఈ ప్రాంతవాసుల విశ్వాసం. సాధారణ మరణాలు కాకుండా బలవన్మరణాలు, అకాల(యాక్సిడెంట్) మరణాలతో మృతి చెందిన వారికి వారి సంతానం ఈ ప్రాంతంలో తిలా తర్పనాలు, శ్రాధ్ద ఖర్మలు చేస్తారు.

News October 1, 2024

MBNR: దసరాకు 649 RTC ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల నుంచి 649 RTC ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. నేటి నుంచి ఈనెల 11 వరకు అదనపు సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ RM వి. శ్రీదేవి తెలిపారు. గద్వాల డిపోలో 89, కల్వకుర్తి-డిపో 67, కొల్లాపూర్ 58, MBNR 69, NGKL 53, నారాయణపేట 54, షాద్‌నగర్ 59, వనపర్తి 95.. అత్యధికంగా అచ్చంపేట డిపో 105 బస్సులు నడపనున్నారు. ఏపీకి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు.