News November 17, 2025
ఈనెల 17న ఉమ్మడి MBNR జిల్లా జూనియర్ ఖో-ఖో ఎంపికలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జూనియర్ ఖో-ఖో (బాలబాలికల) ఎంపికలు నవంబర్ 17న నాగర్‌కర్నూల్ జడ్‌పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. సంగారెడ్డిలోని పటాన్‌చెరువులో జరగనున్న 44వ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్ కోసం ఈ ఎంపికలు జరుగుతాయి. జనవరి 4, 2008 తర్వాత జన్మించిన 18 ఏళ్ల లోపు క్రీడాకారులు అర్హులని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News November 17, 2025
Wow.. సిద్దిపేట నుంచి ఇండియా టీంకు

అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్‌బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్‌తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.
News November 17, 2025
కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావొచ్చా?

కాశీని మనం మోక్ష నగరంగా పరిగణిస్తాం. ఇక్కడ ఉండే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అక్కడ మోక్షం పొందిన ఆత్మల శక్తి గంగాజలంలో ఉంటుందని పండితులు అంటారు. ఆ శక్తిని ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. అయితే హరిద్వార్, రిషికేశ్ వంటి ఇతర పవిత్ర నగరాల నుంచి గంగాజలం తేవడం శ్రేయస్కరం.
News November 17, 2025
శాలిగౌరారం: Way2News ఎఫెక్ట్.. ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం

శాలిగౌరారం(M) ఆకారం గ్రామంలో ఉన్న అతి పురాతనమైన సూర్య దేవాలయం జీర్ణోద్ధరణకు ఇక్కడి యువత నడుం బిగించింది. ఇటీవల Way2Newsలో ‘నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఆకారం, పెర్కకొండారం గ్రామానికి చెందిన 400 మంది యువకులు, యువజన సంఘాలు శ్రమదానం చేసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


