News June 16, 2024

ఈనెల 17న పలు రైళ్ల రద్దు

image

రైల్వే ట్రాక్‌ పై వంతెన మరమ్మతుల కారణంగా ఈ నెల 17న పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. అలాగే పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లనూ రద్దు చేశారు. ఈ మేరకు వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Similar News

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సిద్ధం: కేంద్ర మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం పాతపట్నంలో పీఎం జన్మాన్ వసతిగృహ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్నారు.

News October 2, 2024

సికింద్రాబాద్- శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 07487 నంబర్ గల ట్రైన్ సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఆరు ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఈ రైలు అక్టోబర్ 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని అన్నవరం, విజయనగరం మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు సూచించారు.

News October 2, 2024

స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యం : రామ్మోహన్ నాయుడు

image

స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం నగరంలో సైకిల్ తొక్కుతూ అవగాహన కల్పించారు.