News October 13, 2025
ఈనెల 17వ తేదీన పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 17వ తేదీ శుక్రవారం రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేశ్ కుమార్‌తో సమావేశం అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఇదే పర్యటనలో శంకరగుప్తం డ్రైవ్ ముంపు ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు.
Similar News
News October 13, 2025
తిరుపతి జిల్లాలో ITI చదవాలి అనుకుంటున్నారా?

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లకు 5వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 16. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐ కాలేజీని సంప్రదించాలి.
News October 13, 2025
ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ

హమాస్ నిర్బంధం నుంచి రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలు విడుదల కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘బందీలకు లభించిన ఈ స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి నివాళిగా నిలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ అసమాన శాంతి ప్రయత్నాలు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేసిన హృదయపూర్వక కృషిని స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News October 13, 2025
‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.