News November 9, 2024

ఈనెల 18లోగా టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించాలి: డిఈఓ

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ, ఆదర్శ, గురుకుల, ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 18లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఇతర వివరాలకు సంబంధిత పాఠశాలలోని ప్రధానోపాద్యాయులు సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 22, 2024

సంగారెడ్డి: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

image

ఐలాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన సచిన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మల్లేష్ అనే వ్యక్తికి ఇంటి నంబర్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేసి, రూ.25 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. 10వేలు తీసుకుంటుండగా వీడియో తీసిన మల్లేష్ సెప్టెంబర్ నెలలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ విచారణలో లంచం తీసుకున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.

News November 22, 2024

మెదక్ జిల్లాలో 86 శాతం సర్వే పూర్తి

image

మెదక్ జిల్లాలో సమగ్ర సర్వే నిన్నటి వరకు 86 శాతం పూర్తయిందని అడిషనల్ కలెక్టర్ మెంచు నగేశ్ తెలిపారు. డేటా ఎంట్రీకోసం 516 మందిఆపరేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. 20 మంది ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు 04, ఎంపీ ఎస్వోలు-19లు ఈ డేటా ఎంట్రీలో పాల్గొంటారన్నారు. సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే కంప్యూటర్ ఆపరేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.

News November 21, 2024

సిద్దిపేట: కొత్త కానిస్టేబుల్స్‌కు అభినందనలు: హరీశ్‌రావు

image

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఎంపికై విధుల్లో చేరబోతున్న 8,047 కానిస్టేబుళ్లకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా ఈరోజు అభినందనలు తెలిపారు. నీతి, నిజాయతీతో వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ పోస్టులను భర్తీ చేశారని, వీటిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.