News August 17, 2025
ఈనెల 19న మెదక్ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ స్టేడియంలో ఈనెల 19న ఉ.10కు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయని అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, మధుసూదన్ తెలిపారు. అండర్ 14, 16, 18, 20 బాల బాలికలకు మూడు విభాగాల్లో రన్స్, త్రోస్, జెమ్స్‌లో ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 31న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో జిల్లా తరఫున పాల్గొంటారు.
Similar News
News August 18, 2025
మెదక్: బోనస్ డబ్బుల కోసం వేటింగ్

రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. బోనస్ నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదు. కొనుగోలు జరిపి దాదాపు 5 నెలలు గడుస్తున్నప్పటికీ బోనస్ పడకపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాలో బోనస్ జమ చేయాలని వేడుకుంటున్నారు.
News August 17, 2025
పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సమావేశం

పంచాయితీ రాజ్ శాఖ జిల్లా అధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశం నిర్వహించారు. అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంచాయత్ రాజ్ శాఖ అధ్వర్యంలో చేపడుతున్న నూతన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పునర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. యుద్ధ ప్రతిపాదిక పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
News August 17, 2025
మెదక్: గణేశ్ మండపాల వివరాలు ఆన్‌లైన్ తప్పనిసరి: ఎస్పీ

రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.