News August 17, 2025

ఈనెల 19న రాజంపేటకు YS జగన్

image

YS జగన్మోహన్ రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు గ్రామానికి రానున్నారని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి తెలిపారు. YS జగన్ హెలికాప్టర్‌లో దిగడానికి ఆకేపాడు గ్రామం వద్ద జరుగుతున్న పనులను MLA శనివారం పరిశీలించారు. ఆకేపాటి తమ్ముడి కుమారుడి రిసెప్షన్‌లో పాల్గొనడానికి జగన్ రానున్నారని MLA తెలిపారు.

Similar News

News August 17, 2025

KMR: జాతీయ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ బాలు

image

కామారెడ్డికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వ్యక్తిగతంగా 77 సార్లు రక్తదానం చేసినందుకు ఐవీఎఫ్ జాతీయ పురస్కారాన్ని ఈ నెల 19న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చేతుల మీదుగా న్యూఢిల్లీలో అందుకోనున్నట్లు ఆయన చెప్పారు.

News August 17, 2025

ఆసియా కప్‌కు హర్భజన్ టీమ్ ఇదే

image

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తన జట్టు అంచనాను ప్రకటించారు. ఈ జట్టులో అనూహ్యంగా రియాన్ పరాగ్‌కు చోటు ఇవ్వడం విశేషం. అలాగే సంజూ శాంసన్‌ను పక్కనబెట్టారు. జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిషేక్, గిల్, శ్రేయస్, సూర్య, పంత్, హార్దిక్, సుందర్, పరాగ్, కుల్దీప్, అక్షర్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్. దీనిపై మీ కామెంట్?

News August 17, 2025

ఆగస్టు 17: చరిత్రలో ఈరోజు

image

1817: అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరణం
1866: హైదరాబాద్ ఆరో నవాబు మహబూబ్ అలీ ఖాన్ జననం
1949: తెలుగు గేయ రచయిత భువన చంద్ర జననం
1964: డైరెక్టర్ ఎస్.శంకర్ జననం
1980: రచయిత కొడవటిగంటి కుటుంబరావు మరణం
1993: హీరోయిన్ నిధి అగర్వాల్(ఫొటోలో)జననం
ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం