News December 19, 2025
ఈనెల 20న జరగాల్సిన జాబ్ మేళా వాయిదా

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తలపెట్టిన జాబ్‌మేళా అనివార్య కారణాలవల్ల వాయిదా వేస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 150 పోస్టుల భర్తీకి ఈ మేళా చేపట్టారు. ఏదైనా డిగ్రీ, 18-45 ఏళ్ల వయసున్న వారు అర్హులని, నెలకు రూ.25 వేల వేతనం ఉంటుందన్నారు. తదుపరి తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు.
Similar News
News December 24, 2025
జిల్లాకు తలమానికం ‘జలజీవన్ మిషన్’: కలెక్టర్

జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా జలజీవన్ మిషన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1,650 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసిందని, ఇది జిల్లా అభివృద్ధికి తలమానికమని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
News December 24, 2025
తిరుమలకు ఫేక్ టికెట్లతో వస్తున్నారా..?

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో SP సుబ్బరాయుడు కీలక ప్రకటన చేశారు. ‘డిసెంబర్ 30, 31, జనవరి 1న లక్కీడిప్ టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తాం. అన్ని టోకెన్లను స్కాన్ చేసి అందులోని టైం ప్రకారమే పంపుతాం. నకిలీ టోకెన్లు సృష్టించిన వారిపై, అవి నకిలీ అని తెలిసి కూడా తిరుమలకు తెచ్చిన వారినైనా కేసులు పెడతాం. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్ గైడ్ చేస్తే చర్యలు ఉంటాయి’ అని SP హెచ్చరించారు.
News December 24, 2025
పద్మ అవార్డులు పేర్ల ముందు, వెనుక ఉంచొద్దు: బాంబే హైకోర్టు

‘పద్మ’ అవార్డులను పేర్ల ముందు, వెనుక వినియోగించుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పద్మ అవార్డీ శరద్ హార్దికర్ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆయా రంగాల్లో చేసిన కృషి, సామాజిక సేవకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డులు అందిస్తోందని, దీన్ని గౌరవంగా భావించాలే తప్ప టైటిల్‌గా కాదని స్పష్టం చేసింది. కాగా దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయినా కొందరు పట్టించుకోవడం లేదు.


