News February 16, 2026

ఈనెల 20 నుంచి అహోబిలంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం CAO వీఎల్ఎన్ రామానుజన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎగువ అహోబిలంలో 22న ధ్వజారోహణం, 28న కళ్యాణం తదితర వాహన సేవలు, దిగువ అహోబిలంలో 23న ద్వజారోహణం, మార్చి 1న కళ్యాణం, 3న రథోత్సవం, 4న గరుడసేవ తదితర వాహన సేవలు ఉంటాయన్నారు.

Similar News

News February 20, 2026

రంజాన్ షాపింగ్.. చార్మినార్ వెలుగులు చూడండి!

image

TG: పవిత్ర రంజాన్ మాసం నిన్నటి నుంచి <<19178280>>ప్రారంభమైన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలిరోజు చార్మినార్ వద్ద షాపింగ్‌కు జనం పోటెత్తారు. రాత్రిపూట ఆ ప్రాంతమంతా కిక్కిరిసి కనిపించింది. విద్యుత్ దీపాల వెలుగుల్లో చార్మినార్, మసీదు అద్భుతంగా కనిపించాయి. రంజాన్ నేపథ్యంలో నైట్ షాపింగ్ కోసం తెల్లవారుజాము వరకు షాపులు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మార్చి 20 వరకు ఇది అమల్లో ఉండనుంది.

News February 20, 2026

గుంతకల్లు నుంచి నైరుతి రెడ్డి పోటీ.. క్లారిటీ

image

వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామి రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వివరించినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన కుమార్తె నైరుతి రెడ్డి రాజకీయంగా మరింత పరిణతి చెందాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆయన వెల్లడించారు.

News February 20, 2026

ఆదిలాబాద్: పది పరీక్షలకు 52 పరీక్ష కేంద్రాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.