News December 19, 2025
ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 21న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ తెలిపారు. ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఈ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
Similar News
News December 27, 2025
జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

AP: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో 4-12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోనూ చలి పెరిగింది. ఉత్తర భారతం నుంచి గాలులు, హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు వల్ల శీతల తరంగాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో చలి పెరిగిందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చేవారం మరింత పెరిగే ఆస్కారముందని అంచనా వేస్తున్నారు.
News December 27, 2025
ఊల వేసిన మడిలో నీరుంటుందా?

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 27, 2025
దానాలు చేస్తే పుణ్యమెలా వస్తుంది?

దానం చేయడం వల్ల మనలోని అహంకారం తొలగి, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. ఇతరుల ఆకలిని, అవసరాన్ని తీర్చినప్పుడు కలిగే ఆనందం మనసుకి ప్రశాంతత ఇస్తుంది. స్వార్థం లేకుండా చేసే దానం వల్ల పూర్వజన్మ పాపాలు నశించి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇచ్చే గుణం అలవడటం వల్ల సానుకూల శక్తి పెరిగి, జీవితంలో సంతోషాలు సిద్ధిస్తాయి. దానం కేవలం వస్తువుల మార్పిడి కాదు, మనలోని దయాగుణాన్ని పెంచే ఆధ్యాత్మిక ప్రక్రియ.


