News December 20, 2025

ఈనెల 22‌న జరిగే గ్రీవెన్స్ రద్దు: జనగామ కలెక్టర్

image

ఈనెల 22న జరిగే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈనెల 22న పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉన్నందున, ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. అందువల్ల సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.

Similar News

News December 22, 2025

వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు: సీఎండీ

image

వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సబ్‌స్టేషన్లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు పూర్తి చేయాలని, హెచ్‌టీ సర్వీసులకు AMR అమలు చేయాలని సూచించారు. హై లాస్ ఫీడర్లపై ప్రత్యేక దృష్టి సారించి నష్టాలు తగ్గించాలన్నారు. ఈ మేరకు కార్పొరేట్ కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News December 22, 2025

ములుగు: ప్రజావాణిలో 35 వినతుల స్వీకరణ

image

ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. అదనపు కలెక్టర్లు సిహెచ్.మహేందర్, సంపత్ రావు జీ ప్రజల నుంచి వినతి స్వీకరించారు. మొత్తం 35 వినతులు వచ్చాయి. వీటిలో 8 భూ సమస్యలు, 4 గృహ నిర్మాణం, పెన్షన్‌కు సంబంధించి 6, ఇతర సమస్యలకు సంబంధించిన 17 వినతులు ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.

News December 22, 2025

పోలీసుల అభ్యున్నతికి క్రమశిక్షణే పునాది: SP అజిత

image

పోలీసుల అభ్యున్నతికి క్రమశిక్షణే పునాది అని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. సోమవారం ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం అయింది. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని వాటిని అరికట్టాలంటే పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. చట్టాలపై అవగాహన అవసరమని, దేహధారుడ్యం, మనోనిబ్బరంపై దృష్టిసారించాలని ఆమె కోరారు.